7 Oct, 2024
5 mins read
Dasara Offers: 2 కొంటే 1 ఫ్రీ.. దుమ్మురేపే దసరా పండుగ ఆఫర్లు!
Dasara Offers: 2 కొంటే 1 ఫ్రీ.. దుమ్మురేపే దసరా పండుగ ఆఫర్లు!
దసరా పండుగ ఆఫర్లు అదిరిపోయాయి. పలు రకాల డల్స్ అందుబాటులో ఉన్నాయి. పరిమిత కాలం వరకే ఈ డీల్స్ పొందొచ్చు.
దసరా పండుగ వచ్చేసింది. దీంతో ఇంట్లో వారంతా షాపింగ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ మాల్స్ లేదంటే ఆన్‌లైన్‌లో.. ఎవరికి ఇష్టమైనట్లు వారు షాపింగ్ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కొందరు పిల్లలను పండుగ రోజు బయటకు తీసుకు వెళ్తారు.
ఇలా మీరు కూడా దసరా పండుగకు పిల్లలను బయటకు తీసుకువెళ్లాలని భావిస్తే మాత్రం.. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకని అనుకుంటున్నారా.. అదిరే డీల్ అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో మతిపోయే ఆఫర్ లభిస్తోంది.
భారతదేశంలోనే అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్‌గా కొనసాగుతూ వస్తున్న వండర్‌లా హాలిడేస్ తాజాగా మతిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ డీల్ అందుబాటులోకి తెచ్చింది.
వండర్‌లా కంపెనీ హైదరాబాద్‌లో దసరా పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 10 వరకు ఉంటుంది. పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం వండర్లా ప్రత్యేకంగా '2 కొనుగోలు చేయండి 1 ఉచితంగా పొందండి' అనే టిక్కెట్ ఆఫర్ తీసుకువచ్చింది.
ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లను అక్టోబర్ 10 వరకు చేసుకోవచ్చు. టిక్కెట్లు అక్టోబర్ 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
అలాగే కంపెనీ ఇతర ఆఫర్లు కూడా తెచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌గా 'ఫుడ్ కాంబోతో 2 టిక్కెట్లను కొనుగోలు చేయండి. 1 టిక్కెట్‌ను ఫుడ్ కాంబోతో ఉచితంగా పొందండి' అనే డీల్ కూడా అందుబాటులో ఉంది.
సందర్శకులు అక్టోబర్ 13 వరకు డీజే సెట్, బతుకమ్మ, దసరా నేపథ్య ఊరేగింపు వంటి దసరా ప్రత్యేక ఉత్సవాలను కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వేవ్ పూల్ వద్ద ఆహ్లాదకరమైన గేమ్‌లు, స్ట్రీట్ ఫుడ్ ఫెస్ట్‌లో ట్రీట్‌లను ఆస్వాదించొచ్చు.
ఇంకా రోజంతా స్ట్రీట్ మ్యాజిక్‌ను వినోదాన్ని పొందొచ్చు. కాగా వండర్లా హైదరాబాద్ ఇటీవల హైపర్‌వర్స్, జి-ఫాల్ అనే రెండు కొత్త రైడ్‌లను కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఎవరైతే వండర్‌లా వెళ్లాలని భావిస్తున్నారో.. వారు ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా ముందస్తుగా ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు నేరుగా పార్క్ కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇంకా 084 146 76333, 91000 63636 నెంబర్లకు కాల్ చేయొచ్చు.